Sunday, May 29, 2022

237 MASA SIVARATRI FUNCTION AT SIVAPURI TEMPLE ON 28.05.2022

 జంట నగర శాఖ

      *కార్య దర్శి నివేదిక*

పూజ్య పీఠాధిపతులు శివ శ్రీ డా. అత్తలూరి

మృత్యుంజయ శర్మ గారి దివ్య ఆశ్శిస్సులతో

తేదీ 28.05.2022 , శని వారం, మాస శివరాత్రి నాడు మేము 237వ హోమ 

కార్య క్రమం జయప్రదం గా నిర్వహించటం

జరిగింది.

ఆ రోజు హోమ కార్య క్రమం లో శివశ్రీ అత్తలూరి విజయ కర్ణ గారు,వారి శ్రీమతి గారు మరియు శివశ్రీ ముదిగొండ మల్లిఖార్జున శర్మ (కరీం నగర్) గారూ సతీ సమేతం గా పాల్గొన్నారు.

ఆ పిదప శివశ్రీ అత్తలూరి గంగాధర రావు గారు మన పూజ్య పీఠాధిపతులు శివశ్రీ

డా. అత్తలూరి మృత్యుంజయ శర్మ గారికి పాద పూజ నిర్వహించటం జరిగింది.


అనంతరం శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి గారి చే అనుసృజన చేయబడిన *ఉద్భటారాధ్య

చరిత్ర* గ్రంధము పూజ్య పీఠాధిపతుల కర కమలము లతో, వేదిక నలంకరించిన విశిష్ట అతిధి ప్రముఖ పండితులు, చారిత్రక నవలా చక్రవర్తి, హిందూ మతోద్ధరణకి కంకణం కట్టుకున్న ఆచార్య శివశ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు, పండిత మండలి ప్రధాన సభ్యులు, జంట నగర శాఖ ఉపాధ్యక్షులు

అయిన శివశ్రీ డా. ముదిగొండ అమరనాథ్ శర్మ గారూ, తదితర ప్రముఖ వ్యక్తుల సమక్షం 

లో ఆవిష్కరించడం జరిగింది

శ్రీ మతి ముదిగొండ మల్లీశ్వరి గారు , లలితా సహస్ర నామము వేయి కృతులను రచించి, 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్' లో ప్రథమ మహిళ గా నిలిచిన విదుషీమణీ. ఆమె కాదంబరి, శివానంద లహరి కీర్తనలు, శివ కవచము ,శివ మానస పూజ వంటి గ్రంధములను రచించి నటువంటి రచయిత్రి.

ఆమె మాతామహ, భర్త్రు వంశములకు 

మూల పురుషుడు అయిన ఉద్భటారాధ్యుని

చరిత్రని అనుశృజన చేసి మా జంట నగర శాఖ వారి ద్వారా అవిష్కరింపచేయటం

మా అదృష్టం గా భావిస్తున్నాము.


ఆ తరవాత మా జంట నగర శాఖ వారు ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే కార్యక్రమము మన పూర్వ పీఠాధిపతులు కైలాస వాసి శివ శ్రీ ముదిగొండ నాగ లింగ శాస్త్రి గారి జయంతి ఉత్సవము. ఈ కార్య క్రమం లో మేము ఇద్దరు కవి పండితులు, సాహిత్య వేత్త లకు సన్మానం చేయటం కూడా జరుగుతుంది.


మొదటిగా మేము మన శైవ మహా పీఠం ప్రధాన కార్యదర్శి, శైవ మత ప్రభోధినీ ప్రధాన సంపాదకులు శివ శ్రీ ముదిగొండ చంద్ర శేఖర రావు గారినీ మరియు మన శైవ పీఠ పండిత మండలి సభ్యులు, ప్రముఖ పండితులు శివ శ్రీ ముదిగొండ మల్లిఖార్జున శర్మ గారినీ పూజ్య పీఠాధిపతుల కరకమలములచే, వేదిక నలంకరించిన ప్రముఖ వ్యక్తులు, సభకి విచ్చేసిన ఆరాధ్య బంధువులు, ఆరాధ్యేతర బంధువుల సమక్షం లో  ఘనం గా సన్మానించటం జరిగింది.

శివశ్రీ ముదిగొండ చంద్ర శేఖర రావు గారు

చక్కటి వక్త, సాహితీ మూర్తి, శైవ మహా పీఠ ఆభివృద్ధికి పాటు పడుతున్న నిత్య చైతన్య శీలి. విద్యార్థి దశ నుంచే వీరి రచనా వ్యాసంగం ప్రారంభమై, ఎన్నో సాహితీ కుసుమాలని అందించటం జరిగింది. వీరికి డా. ముదిగొండ శివప్రసాద్ గారు, జ్ఞాన పీఠ అవార్డ్ గ్రహీత డా. రావూరి భరద్వాజ గారి తోనూ అత్యంత సాన్నిహిత్యం ఉంది. అలాగే

వారు శైవ మత ప్రభోధినీ మాస పత్రిక సంపాదకులుగా గత దశాబ్దిన్నర కు పైగా 

సముంచిత కృషి సల్పి, వారి కలం ద్వారా ఎన్నో అద్భుత మైన సంపాదకీయాలు అందిస్తూ, శైవ మత ఘనతను. వైభవాన్ని, యావత్ జాతికి తెలియచేస్తూ, శైవ మత ప్రభోధినీ  మాస పత్రిక ను తీర్చి దిద్దారు.

ఆయన రచించిన సంపాదకీయాలు పుస్తక రూపంలో ముద్రించి మా జంట నగర శాఖ ద్వారా ఆవిష్కరించటం,  మా అదృష్టం గా భావిస్తున్నాము.

ఆయనా,  ఆయన శ్రీమతి ఇందుమతి గారు శైవ మహా పీఠం కి చేసిన సేవ అమోఘమూ, అద్భుతం. శ్రీ కాశీ విశాలాక్షీ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టలు జరిగిన నాటి నుండి ఈ రోజు వరకూ కూడా ఆలయానికి వారు చేసిన సేవ, శైవ మహా పీఠం చరిత్ర లో చిరస్థాయిగా నిలిచి పోతుంది అంటే అతిశయోక్తి కాదేమో.

ఈ నేపథ్యం లో, ఎంతో శ్రమకోర్చి ,ఆ పుణ్య దంపతులు ఆలయానికి కొన్ని వేల సార్లు దర్శించి ఉంటారు. బహుశః ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాదేమో.


మేము ఆదరించి, సన్మానించి న రెండవ ప్రముఖులు, 

మన శైవ మహా పీఠ పండిత మండలి సభ్యులు శివ శ్రీ ముదిగొండ మల్లిఖార్జున శర్మ (కరీంనగర్ వాస్తవ్యులు) గారు.

వారు అత్తలూరి వారింట జన్మించి, సనాతన ఆరాధ్య నెలవై నటువంటి, లచ్ఛపేట గ్రామమునకు దత్త పుత్రుడు అయి, చిరు ప్రాయముననే సంస్కృతాంధ్ర భాషల యందు ప్రావీణ్యము, సముపార్జన చేసి, అత్యున్నత

విశ్వ విద్యాలయాలలో  జ్యోతిశ్శాస్త్రం సహితం గా విద్యాభ్యాసము కావించి, తమ ప్రతిభా పాటవాలతో, పలు ఉత్తీర్ణత పట్టాలు

సాధించి, ఆరాధ్య కులమునకు వన్నె తెచ్చిన ప్రతిభా మూర్తి , పండితులు. వారు ప్రముఖ పుణ్య క్షేత్రాలు అయిన బాసర, జనగామ, వేములవాడ రాజ రాజేశ్వరీ అమ్మవారి ఆశీర్వాద బలం తో, అనేక శత చండీ యాగము లొ నర్చిన యాజ్ఞేకులు, ధన్య జీవులు.,శివ పూజా దురంధరులు. అనేక

ఆధ్యాత్మిక ,ధర్మ శాస్త్ర గ్రంధాలు, పురాణాలు

అధ్యయనం చేసిన పండిత వరేణ్యులు.

వారు ప్రస్తుతం సంస్కృత ఉపాధ్యాయులుగా

TSR Junior కళాశాల , వికారాబాద్ నందు

వారి సేవలు కొనసాగిస్తున్నారు.

అంతటి మహోన్నత వ్యక్తులు, పండితులను

సన్మానించుకోవటం, మా జంట నగర శాఖ వారి అదృష్టం గా భావిస్తున్నాము.


పిదప ఆచార్య శివ శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు తమ ప్రసంగంలో శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి గారి కృషిని ప్రశంసిస్తూ, ఉద్భటారాధ్యా చరిత్ర ను గురించి వివరించారు. వారు సన్మాన గ్రహీతల గురించి కూడా ప్రసంగిస్తూ, వారి ప్రతిభా పాటవాలను

గురించి ప్రసంగించారు , ముఖ్యం గా శివశ్రీ ముదిగొండ చంద్రశేఖర రావు గారి తో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు .

శివ శ్రీ డా. ముదిగొండ అమరనాథ్ శర్మ గారు

మల్లీశ్వరి గారు అనుశృజన చేసిన ఉద్భటారాధ్య చరిత్ర గ్రంధాన్ని పరిచయం చేసి, ఆ తర్వాత సన్మాన గ్రహీతల గురించిన

సన్మాన పత్రాలు చదివి వినిపించారు.

అనంతరం పూజ్య పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేస్తూ, శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి గారి కృషిని ప్రశంసిస్తూ, సన్మాన గ్రహీతల ప్రతిభా పాటవాలను కూడా వివరిస్తూ ప్రసంగించారు.

ఈ కార్య క్రమం లో తమ విశేష అనుభవం తో ప్రఖ్యాత వ్యాఖ్యాత శివశ్రీ  మడిపల్లి దక్షిణా మూర్తి గారు నిర్వహించి అలరించారు. వారికి శివ శ్రీ ముదిగొండ సంతోష్ గారు తమ తోడ్పాటు నందిచారు.

తమ ప్రతిభా వంతమైన సారథ్యం తో జంట నగర శాఖ అధ్యక్షులు శివ శ్రీ M.V. M రావుగారూ, ఎంతో అకుంఠిత దీక్షతో తమ విధులు నిర్వర్తిస్తూ, కార్యక్రమం విజయవంతం చేసిన మా కార్య వర్గ సభ్యులు

అందరూ ధన్య జీవులు., అభినందనీయులు.

వారందరికీ కృతజ్ఞతలు తెలియ చేస్తూ, కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన ఆరాధ్య బంధువులకు, ఆరాధ్యేతర బంధువులకు మా ధన్య వాదాలు అందచేస్తున్నాను.

 









S