Tuesday, July 26, 2022
Sunday, July 17, 2022
Friday, July 15, 2022
శివయోగి ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు (1876-1948)

శివశ్రీ ముదిగొండ నాగలింగశాస్త్రి గారు -1876-ధాత నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి ,సోమవారము నాడు అఘోరారాధ్య -జ్వాలాంబ దంపతులకు -తాడికొండ గ్రామము -గుంటూరు జిల్లా లో జన్మించిరి ..వీరి కుటుంబము -వేదములు ,ఆగమ శాస్త్రములు ,తర్క శాస్త్రములు ,వ్యాకరణము ,ఆయుర్వేదము మరియు జ్యోతిష్ శాస్త్ర ల యందు అగ్రగణ్యులు .దేవాలయములలో శివలింగ ప్రతిష్టలు చేయించగల ప్రజ్ఞావంతులు .
శాస్త్రి గారు -వారి మామయ్య గారైన -శివశ్రీ మల్లంపల్లి వీరేశలింగరాధ్య (పమిడిముక్కల ) గారి వద్ద ప్రాధమిక విద్య నభ్య సించెడి వారు .
తన 15 వ సంవత్సరములో -శ్రీ కాళహస్తి కి జేరి 'అపరపతంజలి ' బిరిరుదాంకితులుశ్రీనివాస్ శాస్త్రీగల్ వారి వద్ద -వ్యాకరణము నభ్యసించి -తదుపరి 19వ సం !!లో వారితోనడుక్కవేలి (తమిళనాడు )వెళ్లి -తర్కము ,మీమాంస ,శంకర మరియు మధ్య భాష్యము మొ !! శాస్త్రముల నెఱింగి -వారితోనే తర్కించి -ప్రశంసల నొందెను .ఆ సమయమున 'రక్ష రుద్రాక్ష చంద్ర మార్తాండము 'అను సంస్కృత గ్రంధమును -తమిళమునందు అనువదిందించి -గురువునకంకితం జేసిరి .
సంతసించిన శ్రీనివాస్ శాస్ట్రీగాళ్ -తనవద్దగల -'నీలకంఠ భాష్యము ' తాళపత్ర గ్రంధమును యిచ్చి "ఇది శైవ సిద్దాంతములలో చాలా గొప్పదయిన పొత్తము ,దీనిని నీవు అనువదించి -విపులీకరించి -పండితులకు లభ్యము జేసి శివుని ఆశీర్వాదము పొందుదువుగాక !"అని నుడివెను
545 బ్రహ్మ సూత్రములు గల 'నీలకంఠ భాష్యము ' ను -నాగలింగ శాస్ర్హి గారు 'శివ చింతామణి ప్రభ వ్యాఖ్యానము 'గా ప్రచురించిరి .
అందు ముఖ్య విషయములు :
1,జీవ- ఈశ్వర యదార్ధ స్వరూపము .
2.ఈ జగత్తు మిధ్య కాదు .
3.జగత్కారకుడు ఈశ్వరుడే !
4.సూన్య వాదము -నిర్గుణ వాదములు -అవివేకములు
5.శివలింగార్చన -శైవ దీక్ష లేదా సాంభవ దీక్ష లేదా పాశుపత వ్రతము లేదా పాశుపత దీక్ష లేదా శిరోవ్రతము ,మరియు ఇష్ట ,ప్రాణ తత్పరాయ ,భవ లింగధారణ -ఇవి అన్నియు శివ సాయుజ్యము నొందుటకు మూలకారణములు .
వారు 'శ్రోత శైవ ప్రకాశిక 'అను పత్రికను -తెలుగు /సంస్కృత బాషలలో -శైవ సిద్ధాంతము గురుంచి .బ్రహ్మ తారక స్తత్వము ,చతుర్వేద తత్పరాయ సంగ్రహము ,శైవ కరుణామృతము మరియు పంచరత్న స్తుతి మొదలగు వాటి గురుంచి విపులముగా ప్రచురించుచుండెడివారు .
1900-1903-సమయమున వారు -5 పుస్తకములు తెలుగు /సంస్కృత భాషల యందు -1)శైవ సిద్ధాంత సంగ్రహము . 2)శైవయేవ కారణం 3)శ్రౌతమేవాహి శైవ చిహ్నవి 4)శ్రౌత మేవాహి ధారణం లింగస్య 5)శిష్ట సర్వేహ శివమ్ ప్రపన్నహ -ప్రచురించిరి
1904 నుంచి 1916 వరకు శైవ సిద్ధాంత భాష్యము గురుంచి అనేక ప్రదేశములలో పర్యటించుచు -పండితులతో తర్కించి మెప్పు పొందిరి . 1916నుండి 1948వరకు తెనాలి పట్టణమున నివసించి ఉండెడివారు .
1928-31-కాలములో' శైవ రహస్య బోధిని '-మరియు 1933లో జ్ఞాన వాహిని అను పత్రికలో శివుని గురుంచి ,శైవ సిద్ధాంతముల గురుంచి -అన్నిటికి మూల కారకుడు శివుడొక్కడే! యని వేద శాస్త్రాలయందు కలదని నిరూపించిరి
శైవులు చేయవలసిన -లింగధారణ .,భస్మధారణ , రుద్రాక్ష ధారణ ,అంత్యేష్టి ,అసౌచాము -మొ !!వాటి గురుంచి పుస్తకములు ప్రచురించిరి .
దేశవిదేశాలలో వారు ఎవ్వరును శాస్త్రి గారు వ్రాసిన 'శ్రౌత శైవ సిద్ధాంత' గ్రంథములను విమర్శించలేకపోయిరి .
ఈ విధముగా వారు సముస్కృతాంధ్ర బాషలలో 100 పుస్తకముల పైన ప్రచురించిరి .వారు వ్రాసిన 'కాదంబరి 'అను పుస్తకము నా రోజులలో
బి .ఏ .(లిట్ ) వారికీ టెస్ట్ బుక్ గా ఉండెడిది .
1917-18,1919-21,1930-34,1941-48వరకు శ్రీ శైవ వమహాపీఠమునకు పీఠాధిపతిగా బాధ్యతలను స్వీకరిం చిరి .
1937 వ సo !!-వారికి శైవమహాపీఠము- విజయవాడ వారు -శాస్ట్రీ గారికి షష్టాబ్ధి పూర్తి మహోత్సవము నిర్వాహించారు .
వారి పుస్తకములు భారతీయ భాషలలోనే గాక ,ఆంగ్లము నందు గూడ అనువదించి ప్రచురించ బడినవి .
ఇంకను వారి గ్రంధములను ఆంగ్లములో అనువదించి ప్రచురించ వలసిన అవసరము ఎంతైనను కలదు .
హర హర మహాదేవ !

ఆరాధ్య చరిత్ర
ఆరాధ్యులు
వీరికి ఆగమాలలో ఆదిశైవులు అని పేరు. వీరే లిం
Wednesday, July 13, 2022
Monday, July 11, 2022
Tuesday, July 5, 2022
Subscribe to:
Posts (Atom)