Sunday, July 5, 2020

Guru POURNAMI 05.07.2020

గురు పూర్ణిమ సందర్భంగా నాగోల్ శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం లో శైవ మహాపీఠం పీఠాధిపతి శివారాధ్య మృత్యుంజయ శర్మ గారికి జరిగిన పాదపూజ
















Thursday, May 21, 2020

_*నేడు మాస శివరాత్రి ? ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? వలన ఉపయోగములు*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

1. మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి
ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం.
శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి

*2. మాస శివరాత్రి  ఎందుకు జరుపుకోవాలి?*
మహాశివుడు లయ కారకుడు.  కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు  కేతువు, అమావాస్య  ముందు వచ్చే చతుర్ధసి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.

*చంద్రోమా మనస్సో జాతః*

అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో  తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణము లకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.

అందుకే మనం గమనించవచ్చు .., అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించదానికి కారణము ఇదే అని చెప్పవచ్చు.
కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.

*3. మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ?*
ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5,11,18,21,56,108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.

అలాగే ఆరోజు ప్రదోష వేల శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి, మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.

*4. మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు ?*
ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.
వృత్తి అంశంలో ఉన్న ఆలశ్యాలు, అవరోధాలు అంశంలో మార్పు కల్గుతుంది.
దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి  ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఘంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖశ్చ్హితముగా మార్పు వస్తుందని భావించవచ్చు.
మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందుదాం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*ప్రవర యొక్క అర్ధం.*

*చతుస్సాగర పర్యంతం*
(మానవ పరిభ్రమణానికి నలువైపులా కల మహాసముద్రాల అంచుల వరకూ)...

*గో బ్రాహ్మణేభ్య శుభం భవతు*(సర్వాబీష్ట ప్రదాయిణి అగు..గోవూ మరియు నిత్యం సంఘహితాన్నే అభిలషించే సద్బ్రాహ్మణుడు అతడి రూపంలో ప్రకాశించే వేదధర్మం.. సర్వే సర్వత్రా దిగ్విజయంగా.. శుభప్రదంగా వర్ధిల్లాలని కోరుకుంటూ)....

*×××××××. ఋషేయ ప్రవరాన్విత..*
(మా వంశమునకూ..మా గోత్రమునకూ మా నిత్యానుష్ట ధర్మశీలతకు మూలపురుషులైన మా ఋషివరేణ్యులకూ..

*త్యాగే నైకే అమృతత్త్వ మానశుః......*
అన్న వారి మహోన్నతమైన త్యాగనిష్ఠకు సాక్షీభూతుడనై..

*×××××× గోత్రః*
(మా గోత్రమునకూ..)

*ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ.....*
(మా శాఖకూ..అందలి శాస్త్ర మర్మంబులకు..)

*శ్రీ* *** *శర్మ నామధేయస్య*
( కేవలం జన్మతహానే కాక.. ఉపనయనాది సంస్కారాలతో.. శాస్త్రపఠనంతో..వేదాధ్యయనాది వైదిక క్రతువులతో..
1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హోమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము అనబడే అష్టకర్మలనూ క్రమంతప్పక నిర్వహిస్తూ..త్రివిధాగ్నులు...
1.కామాగ్ని
2.క్రోధాగ్ని
3.క్షుద్రాగ్ని..
అనే త్రివిధాగ్నులను అదుపులో(సమస్థితిలో) ఉంచుకొన్న వాడినై..పేరుకు ముందు శ్రీ అనబడే..ప్రకృతి స్వరూపమైన శక్తిస్వరూపాన్ని.. శుభప్రదమైన శ్రీకారాన్ని ధరించిన..

*శ్రీ * *శర్మా* అనబడే సుశ్రోత్రియుడనైన నేను..జన్మప్రధాతలైన జననీజనకులముందు..  జ్ఞానప్రధాతలైన ఆచార్యులముందు.. జ్ఞానస్వరూపమైన వేదముముందు..యావత్ ప్రపంచానికే మార్గదర్శకమైన వేదధర్మము ముందు.. నిరాకార నిర్గుణ అవ్యాజ పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు..

*అహంభో అభివాదయే..*
( కేవలం నేనూ అన్నదిలేక.. సర్వం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ భాగ్యమేయన్న అహంకారభావ రహితుడనై.. నిగర్వినై..త్రికరణ శుద్ధిగా (మనసా,వాచా,కర్మణా) సాష్టాంగ పూర్వక (మానవశరీరంలోని అత్యంత ప్రాధాన్యమైన ఎనిమిది శరీరాంగములనూ శరణాగత హృదయంచే నేలపై వాల్చి సమర్పిస్తున్న)దండ ప్రణామమిదే..అన్న పరిపూర్ణమైన ఆత్మపూర్వక వేదపూర్వక హృదయపూర్వక నమస్కార భావమే.. సశాస్త్రీయమైన ఈ ప్రవరలోని..అర్ధం అంతరార్ధం పరమార్ధం కూడా..

Sunday, May 10, 2020

నేడు లోకారాధ్యులు కై!!వా!! శ్రీ ముదిగొండ శంకరారాధ్యుల వారి 101వ జయంతి ఉత్సవం ,  వరంగల్ శంకరారాధ్య నిలయం లో చక్కగా నిర్వహింపబడినది.......
ఆ కార్యక్రమం విజయవంతం చేసిన  ఆరాధ్య బంధువులు







Wednesday, March 25, 2020

ఆరాధ్య బంధువులందరికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఆరాధ్య బంధువులందరికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

బ్రహ్మశ్రీ అడుసుమిల్లి లీలాప్రసాద్ గారి పంచాంగ పఠనం వీడియో ఇక్కడ పొందుపరచడమైనది

మొడటి భాగం : గ్రహ స్థితిగతులు, భారతదేశం పై గ్రహ ప్రభావం

https://youtu.be/z_B6R_1Ls4U

రెండవ భాగం :  ద్వాదశ రాసుల గ్రహ సంచార ఫలితాలు    

https://youtu.be/eaLqW8IaItI


అందరూ వీక్షించగలరు

మీ
ముదిగొంద చంద్రశేఖర్
ప్రధాన కార్యదర్శి, శ్రీ శైవమహాపీఠం  

Note : Kindly use headphones for better audio impact and clarity.
Please subscribe to.the channel for latest updates..🙏

Tuesday, March 3, 2020

భీమిలి లో గురువు గారు స్టడీ రూం వైపు నడుస్తూ వచ్చినప్పుడు ఏర్పడ్డ వారి పాదముద్రలు. 2-03-2020 సాయంత్రం.









Tuesday, February 25, 2020

Fecilitation to Hanumantha Rao garoat Warangal


Friday, February 21, 2020

SIVARATRI at Sivapuri temple 21.02.2020






Friday, February 14, 2020

వీరభద్రా🌹యనమః 🌹 8. 2. 2020 న జరిగిన

 వీరభద్రా🌹యనమః  🌹

      8.  2. 2020 న జరిగిన
శివమెత్తించిన భద్రకాళి సామేత వీరభద్ర పళ్లెం , దిగ్విజయంగా ఎవరి బాధ్యత వారు నిర్వహించినందుకు , విజయవంతం  అయిన సందర్భముగా , కమిటీ వారు , కల్యాణ వీరభద్ర కమిటీ వారిని ,సన్మానించి
వీరభద్ర మెమొంటోస్ను అందచేసి  శాలువాతో  ,
అందరిని సన్మానించిన  దృశ్యాలు ,  ఇదే కమిటీ
మహాశివరాత్రి కమిటీ అవుతుందని
సభాపూర్వకంగా, తెలియజేసారు  .
    శుభం  భూయాత్

K.  S.  M.







Monday, February 10, 2020

Veerabhadra Pallem at Vijayawada SAIVA mahapeetham On 8.2.2020










Wednesday, October 30, 2019

1st day Ganarchana 2019-కార్తీక మాసం /మొదటిరోజు గణార్చన

Tuesday, October 8, 2019


Poornahuti at Sivapuri temple on 07.10.2019 Navaratri 

Wednesday, October 2, 2019

KASI VISALAKSHI SUPRABHATAM

Tuesday, October 1, 2019

SHAKTHI PEETHAMS SHODASA PUJA