Thursday, February 8, 2024

258 మాస శివరాత్రి 08.02.2024

At SIVAPURI temple 












 

Wednesday, January 10, 2024

Masa SIVARATRI 10.01.2024








తేదీ 10-1-24(బుధవారం ) మాసశివరాత్రి కార్యక్రమములు లతో బాటు శైవమహాపీఠం జంటనగరశాఖ చే ఏర్పాటు చేయబడిన శ్రీశైవమహాపీఠ సభ్యత్వ నమోదు శిబిరము.











 

Wednesday, December 27, 2023

అరుద్రోత్సవం 27.12.2023

 🌹ఆరుద్రోత్సవం ప్రదోషకాలం!!













శ్రీ శైవ పీఠం జంట నగర శాఖ కార్య వర్గం వారు  అత్యంత ముఖ్యమైన ఉత్సవం 27-12-2023 బుధవారం ప్రదోష కలమందు,, పీఠాది పతి గారి ఆశీసులతో, శివశ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి బ్రహ్మత్వంలో నాగోల్ లోని శివాలయం. నందు కాశీ విశాలాక్షి సహిత విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో ఘనంగా స్వామికి,  ఆరుద్రోత్సవం!  ఇది కూడ హిందువులలో శైవులకు ప్రధానమైన ఉత్సవం!  పరమేశ్వరుని యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర.

Monday, December 11, 2023

Ganarchana 11.12.23








































శ్రీ శైవమహాపీఠము,విజయవాడ నందు నిన్న అనగా ది 11/12/2023 సోమవారం ఉదయం శివశ్రీ ముదిగొండ బాల శశాంక మౌళి గారి, శివశ్రీ ములుగు రామలింగం గారి బ్రహ్మత్వములో అభిషేకమునకు, అన్నదానమునకు  ధనరూపము లోను,వస్తురూపము లోను శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి సమర్పించుకున్న భక్తుల గోత్ర నామాలు చదివి  మహాన్యాస పూర్వకముగా పంచామృతాలతో, ఫల రసాలతో, నమక, చమక, పురుషసుాక్త, శ్రీసుాక్తాలతో ఏకాదశ రుద్రాభిషేకం, శివ సహస్ర నామాలతో వివిధ రకముల పుష్పములతో, బిల్వదళములతో అభిషేకం జరిగినది. పలువురు భక్తులు మల్లేశ్వర స్వామి వారికి స్వయము గా అభిషేకం చేసుకున్నారు. అర్చన,నీరాజన, మంత్ర పుష్పము అనంతరము తీర్ధ ప్రసాద వితరణ జరిగినది. 

సాయంత్రం 6.30 గంటలకు గణార్చన కార్యక్రమం మొదలైనది. గురుస్థాన మహేశ్వరులు శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వరశర్మ గారు. శివశ్రీ  శివలెంక నరేంద్ర కుమార్ గారు మచిలీపట్నం దంపతులు గణార్చన చేసుకున్నారు. బ్రహ్మ గారు శివశ్రీ ములుగు రామలింగం గారు గణార్చన నిర్వహించారు.

గురుస్థాన మహేశ్వరులు శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వరశర్మ గారు గణార్చన చేసుకున్నవారికి రజిత ఉమామహేశ్వరుల రూపును బహుకరించినారు. 


శ్రీశైవపీఠము కార్యవర్గ సభ్యులు, ఆరాధ్యులు, ఆరాధ్య బంధువులు హాజరు అయినారు. అనంతరము అన్న ప్రసాద వితరణ జరిగినది.


ఈ రోజు అనగా 12/12/2023 మంగళవారం గణార్చన చేసుకొనువారు  శివశ్రీ ముదిగొండ మల్లికార్జున శర్మ గారు దంపతులు.

కావున భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి తీర్ధ, ప్రసాదములు,ఆశీస్సులు పొందగోరుచున్నాము.


ధన్యవాదములు


ఇట్లు

కార్యవర్గం

శ్రీ శైవమహాపీఠము

విజయవాడ