Monday, September 26, 2022

240 masa sivaratri -an appreciation



🙏. శుభోదయం.
నిన్నటి(అనగా 24.09.2022)  మాస శివ రాత్రి హోమ కార్య క్రమం 240వది. అంటే గత ఇరవై ఏళ్ళు గా మేము ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నం గా చేశాము. ఆ పరమేశ్వరుడు మాకు కల్పించిన మహాద్భుత అవకాశం.ఇటువంటి అవకాశం దక్కటం మా కార్య కర్తలు చేసుకున్నటు వంటి అదృష్టం గా భావిస్తున్నాను.
అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న  శశి భూషణ్,, భాస్కర్, వీరేష్  ధన్య జీవులు..  . అలాగే కైలాసవాసి 
శివశ్రీ . S.P.Ramesh gari పాత్ర కూడా మరువలేనిది. మేము ఎంత సంకల్పించినా శివ శ్రీ 
ముదిగొండ అమరనాథ్ శర్మ, నాగ రాజ శర్మ , ముత్యంపేట గౌరీ శంకర శర్మ, అత్తలూరు సోమేశ్వర శర్మ ల పాత్ర లేకపోతే మేము అంత విజయ వంతం అయ్యేవారం కామేమో. వారి అఖుంటిత దీక్ష అమోఘ మైనది,  నిరుపమానమైనది..
 మొదటి నుండి జంట నగర శాఖ కొమ్ము కాసిన వారిలో వారి పాత్ర అద్భుతమైనది. అట్టి వారు లేకపోతే ఈ మహాద్భుతం జరిగేది కాదేమో. వారికి జంట నగర శాఖ శతధా, సహశ్రధా,  ఋణ పడి ఉంటుంది.
ఆ పరమ శివుడే మా చేత , గురుదేవులు కైలాస వాసి సద్గురు శివశ్రీ శివానంద మూర్తి గారి చే ఆదేశింప చేసి, ఆ నలుగురి చేత నిర్విఘ్నం గా ఈ యాగం చెయ్యటానికి ఆదేశించి పంపారు అనిపిస్తోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు పాల్గొన్న మా కార్య కర్తలు, చేయూత నిచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన
పూజ్య పీఠాధిపతులు డా. అత్తలూరి  మృత్యుంజయ శర్మ గారు, అన్ని విధాలా ప్రోత్సహించి, సహకరించి ఉత్సాహ పరచిన ప్రతి ఒక్క ఆరాధ్య బంధువులకు, ఆరా ధ్యేతర బంధువులకు, ముఖ్యం గా శైవ మహా పీఠం కేంద్ర పాలక మండలి కి,  జంట నగర శాఖ శతధా సహస్రథా ఋణ పడి ఉంటుంది. 
అందులో మొదటి నుండి కూడా శివశ్రీ ముదిగొండ సేనాపతి గారు, వారి దివంగత శ్రీమతి సౌభాగ్య లక్ష్మి గారు 
 నిర్వహించిన పాత్ర కూడా మరువ లేనిది.
ఇట్లు
ముదిగొండ వీరభద్ర మల్లిఖార్జున రావు
( M V M Rao)
అధ్యక్షులు
 జంట నగర శాఖ
25.09.2022.