Saturday, April 23, 2022

235 Masa SIVARATRI

235 Masa  SIVARATRI

At SIVAPURI temple



Thursday, April 7, 2022

Ugadi puraskaramulu *శ్రీ శుభకృత్ నామ సంll ఉగాది ఉత్సవములు శ్రీ శైవమహాపీఠమ్ నాగోల్ హైదరాబాదు , విశాలాక్షీ సహిత కాశీ విశ్వేశ్వరాలయము లో అత్యంత వైభవోపేతముగా జరిగినవి* ఉదయము గోపూజ, విజయగణనతి కి అభిషేకము, అర్చన, విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం, శ్రీ విశాలాక్షీ అమ్మవారికి అభిషేకము అర్చన, కుంకుమార్చన లు జరుగగా పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. సాll 6 గంll లకు చిన్నారులు చిరంజీవులు అక్షధ, అపరాజిత ల చక్కని నృత్యప్రదర్శన తో సాంస్క్రత  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుమారి చిరంజీవి సుముఖి నృత్యాభినయనం ప్రేక్షకులను మంత్రముద్గులను చేసింది. ఆపై చిన్నారులు చిరంజీవులు ఆర్యమాన్, అక్షధ,అపరాజిత లు వేదపఠనం గావించారు. పూజ్యులు మాన్యులు శివశ్రీ ములుగు హనుమంతరావు గారు, పూజ్యులు చారిత్రక నవలా చక్రవర్తి  శివశ్రీ డాllముదిగొండ శివ ప్రసాద్,విశ్రాంతాచార్యులు మరియు శైవమత ప్రబోధిని మాస పత్రిక లో అనేక రచనలను చేబట్టి మననందరినీ ప్రతినెలా పలకరించే శివశ్రీ శివలెంక ప్రకాశ రావు గార్లతో బాటు గౌరవ ప్రధాన కార్యదర్శి శివశ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గార్ల దీప ప్రజ్వలన తో *ఉగాది సాహితి పురస్కార ప్రదానం* మొదలయ్యింది. సాహిత్య రంగంలో  విశేష కృషి సల్పిన ఆరాధ్య బంధువు లను సుందరాకృతమైన వేదికపై మన పెద్దలు ఆహ్వానిత మహేశ్వరుల హర్షధ్వానాల మధ్య  సముచిత సత్కారం, ఉగాది సాహితి పురస్కారము అందించడం, అపై వారి స్పందనలను తెలియచేయడం -  ఆద్యంతము కన్నుల పండుగగా జరిగింది. యావత్ కార్యక్రమానికి వాఖ్యాతలు, ప్రయోక్తలు గా శివశ్రీ దక్షణామూర్తి మరియు శ్రీమతి ముదిగొండ దుర్గా కళ్యాణి గార్ల సమయోచిత సభానిర్వహణా చాతుర్యం చాలా రక్తి కట్టించింది. బ్రllశ్రీll  అడుసుమిల్లి లీలా ప్రసాద్ గారి శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ఆహుతులంతా భక్తి శ్రధ్ధ లతో విన్నారు. ప్రధాన కార్యదర్శులవారి వందన సమర్పణ తో కార్యక్రమం సంపూర్ణమైంది. యావత్ కార్యక్రమం ఇంతగొప్పగా, నేత్ర పర్వంగా జరగటం లో శీవశ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారు, ప్రధాన కార్యదర్శి అత్యంత శ్రధ్ధతో, అంకుటిత దీక్ష తో, ఖచ్చితమైన ప్రణాళిక తో ఈ కార్యక్రమాన్ని రచించి నిర్వహించినతీరు భావితరాలకు మార్గదర్శనీయమైనది అనటం అతిశయోక్తి కాదేమో.

శ్రీ శుభకృత్ నామ సంll ఉగాది ఉత్సవములు శ్రీ శైవమహాపీఠమ్ నాగోల్ హైదరాబాదు , విశాలాక్షీ సహిత కాశీ విశ్వేశ్వరాలయము లో అత్యంత వైభవోపేతముగా జరిగినవి*  ఉదయము గోపూజ, విజయగణనతి కి అభిషేకము, అర్చన, విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం, శ్రీ విశాలాక్షీ అమ్మవారికి అభిషేకము అర్చన, కుంకుమార్చన లు జరుగగా పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది.  సాll 6 గంll లకు చిన్నారులు చిరంజీవులు అక్షధ, అపరాజిత ల చక్కని నృత్యప్రదర్శన తో సాంస్క్రత  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుమారి చిరంజీవి సుముఖి నృత్యాభినయనం ప్రేక్షకులను మంత్రముద్గులను చేసింది. ఆపై చిన్నారులు చిరంజీవులు ఆర్యమాన్, అక్షధ,అపరాజిత లు వేదపఠనం గావించారు.  పూజ్యులు మాన్యులు శివశ్రీ ములుగు హనుమంతరావు గారు, పూజ్యులు చారిత్రక నవలా చక్రవర్తి  శివశ్రీ డాllముదిగొండ శివ ప్రసాద్,విశ్రాంతాచార్యులు మరియు శైవమత ప్రబోధిని మాస పత్రిక లో అనేక రచనలను చేబట్టి మననందరినీ ప్రతినెలా పలకరించే శివశ్రీ శివలెంక ప్రకాశ రావు గార్లతో బాటు గౌరవ ప్రధాన కార్యదర్శి శివశ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గార్ల దీప ప్రజ్వలన తో *ఉగాది సాహితి పురస్కార ప్రదానం* మొదలయ్యింది.  సాహిత్య రంగంలో  విశేష కృషి సల్పిన ఆరాధ్య బంధువు లను సుందరాకృతమైన వేదికపై మన పెద్దలు ఆహ్వానిత మహేశ్వరుల హర్షధ్వానాల మధ్య  సముచిత సత్కారం, ఉగాది సాహితి పురస్కారము అందించడం, అపై వారి స్పందనలను తెలియచేయడం -  ఆద్యంతము కన్నుల పండుగగా జరిగింది.  యావత్ కార్యక్రమానికి వాఖ్యాతలు, ప్రయోక్తలు గా శివశ్రీ దక్షణామూర్తి మరియు శ్రీమతి ముదిగొండ దుర్గా కళ్యాణి గార్ల సమయోచిత సభానిర్వహణా చాతుర్యం చాలా రక్తి కట్టించింది.   బ్రllశ్రీll  అడుసుమిల్లి లీలా ప్రసాద్ గారి శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ఆహుతులంతా భక్తి శ్రధ్ధ లతో విన్నారు. ప్రధాన కార్యదర్శులవారి వందన సమర్పణ తో కార్యక్రమం సంపూర్ణమైంది.  యావత్ కార్యక్రమం ఇంతగొప్పగా, నేత్ర పర్వంగా జరగటం లో శీవశ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారు, ప్రధాన కార్యదర్శి అత్యంత శ్రధ్ధతో, అంకుటిత దీక్ష తో, ఖచ్చితమైన ప్రణాళిక తో ఈ కార్యక్రమాన్ని రచించి నిర్వహించినతీరు భావితరాలకు మార్గదర్శనీయమైనది అనటం అతిశయోక్తి కాదేమో