Tuesday, July 26, 2022

Masa SIVARATRI function 26.07.2022. At SIVAPURI temple














 

Sunday, July 17, 2022

https://youtu.be/cRLETeFFHeY

 Veerabhadra Aradhana 

Friday, July 15, 2022

శివయోగి ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు (1876-1948)

శివయోగి ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు (1876-1948)
శివశ్రీ ముదిగొండ నాగలింగశాస్త్రి గారు -1876-ధాత నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి ,సోమవారము నాడు అఘోరారాధ్య -జ్వాలాంబ దంపతులకు -తాడికొండ గ్రామము -గుంటూరు జిల్లా లో జన్మించిరి ..వీరి కుటుంబము -వేదములు ,ఆగమ శాస్త్రములు ,తర్క శాస్త్రములు ,వ్యాకరణము ,ఆయుర్వేదము మరియు జ్యోతిష్ శాస్త్ర  ల యందు అగ్రగణ్యులు .దేవాలయములలో శివలింగ ప్రతిష్టలు చేయించగల ప్రజ్ఞావంతులు . 

శాస్త్రి గారు -వారి మామయ్య గారైన -శివశ్రీ మల్లంపల్లి  వీరేశలింగరాధ్య (పమిడిముక్కల ) గారి వద్ద ప్రాధమిక విద్య నభ్య సించెడి వారు . 

తన  15 వ సంవత్సరములో -శ్రీ కాళహస్తి కి జేరి 'అపరపతంజలి ' బిరిరుదాంకితులుశ్రీనివాస్ శాస్త్రీగల్ వారి వద్ద -వ్యాకరణము నభ్యసించి -తదుపరి 19వ సం !!లో వారితోనడుక్కవేలి (తమిళనాడు )వెళ్లి -తర్కము ,మీమాంస ,శంకర మరియు మధ్య భాష్యము మొ !! శాస్త్రముల నెఱింగి -వారితోనే తర్కించి -ప్రశంసల నొందెను .ఆ సమయమున 'రక్ష రుద్రాక్ష చంద్ర మార్తాండము 'అను సంస్కృత గ్రంధమును -తమిళమునందు అనువదిందించి -గురువునకంకితం జేసిరి . 
సంతసించిన శ్రీనివాస్ శాస్ట్రీగాళ్ -తనవద్దగల -'నీలకంఠ భాష్యము ' తాళపత్ర గ్రంధమును యిచ్చి "ఇది శైవ సిద్దాంతములలో చాలా గొప్పదయిన పొత్తము ,దీనిని నీవు అనువదించి -విపులీకరించి -పండితులకు లభ్యము జేసి శివుని   ఆశీర్వాదము  పొందుదువుగాక !"అని నుడివెను 
545 బ్రహ్మ సూత్రములు గల 'నీలకంఠ భాష్యము ' ను -నాగలింగ శాస్ర్హి గారు 'శివ చింతామణి ప్రభ వ్యాఖ్యానము 'గా ప్రచురించిరి . 
అందు ముఖ్య విషయములు :
1,జీవ- ఈశ్వర యదార్ధ స్వరూపము . 
2.ఈ జగత్తు మిధ్య కాదు . 
3.జగత్కారకుడు ఈశ్వరుడే !
4.సూన్య వాదము -నిర్గుణ వాదములు -అవివేకములు 
5.శివలింగార్చన -శైవ దీక్ష లేదా సాంభవ దీక్ష లేదా పాశుపత వ్రతము లేదా పాశుపత దీక్ష లేదా శిరోవ్రతము ,మరియు ఇష్ట ,ప్రాణ తత్పరాయ ,భవ లింగధారణ -ఇవి అన్నియు శివ సాయుజ్యము నొందుటకు మూలకారణములు .

వారు 'శ్రోత శైవ ప్రకాశిక 'అను పత్రికను -తెలుగు /సంస్కృత బాషలలో -శైవ సిద్ధాంతము గురుంచి .బ్రహ్మ తారక స్తత్వము ,చతుర్వేద తత్పరాయ సంగ్రహము ,శైవ కరుణామృతము మరియు పంచరత్న స్తుతి మొదలగు వాటి గురుంచి విపులముగా ప్రచురించుచుండెడివారు . 

1900-1903-సమయమున వారు -5 పుస్తకములు తెలుగు /సంస్కృత  భాషల యందు  -1)శైవ సిద్ధాంత సంగ్రహము . 2)శైవయేవ కారణం 3)శ్రౌతమేవాహి శైవ చిహ్నవి  4)శ్రౌత మేవాహి ధారణం లింగస్య 5)శిష్ట సర్వేహ శివమ్ ప్రపన్నహ -ప్రచురించిరి 

1904 నుంచి 1916 వరకు శైవ సిద్ధాంత భాష్యము గురుంచి అనేక ప్రదేశములలో పర్యటించుచు -పండితులతో తర్కించి మెప్పు పొందిరి . 1916నుండి 1948వరకు తెనాలి పట్టణమున నివసించి ఉండెడివారు . 
1928-31-కాలములో' శైవ రహస్య బోధిని '-మరియు 1933లో జ్ఞాన వాహిని అను పత్రికలో శివుని గురుంచి ,శైవ సిద్ధాంతముల గురుంచి -అన్నిటికి మూల కారకుడు శివుడొక్కడే! యని వేద శాస్త్రాలయందు కలదని నిరూపించిరి 

శైవులు చేయవలసిన -లింగధారణ .,భస్మధారణ , రుద్రాక్ష ధారణ ,అంత్యేష్టి ,అసౌచాము -మొ !!వాటి గురుంచి పుస్తకములు ప్రచురించిరి . 
దేశవిదేశాలలో వారు ఎవ్వరును శాస్త్రి  గారు వ్రాసిన 'శ్రౌత శైవ సిద్ధాంత' గ్రంథములను  విమర్శించలేకపోయిరి . 
ఈ విధముగా వారు  సముస్కృతాంధ్ర బాషలలో 100 పుస్తకముల పైన  ప్రచురించిరి .వారు వ్రాసిన 'కాదంబరి 'అను పుస్తకము నా రోజులలో 
బి .ఏ .(లిట్ ) వారికీ టెస్ట్ బుక్ గా ఉండెడిది . 
1917-18,1919-21,1930-34,1941-48వరకు శ్రీ  శైవ వమహాపీఠమునకు పీఠాధిపతిగా బాధ్యతలను స్వీకరిం చిరి . 
1937  వ సo !!-వారికి శైవమహాపీఠము- విజయవాడ వారు -శాస్ట్రీ   గారికి  షష్టాబ్ధి  పూర్తి మహోత్సవము నిర్వాహించారు . 
వారి పుస్తకములు భారతీయ భాషలలోనే గాక ,ఆంగ్లము నందు గూడ అనువదించి ప్రచురించ బడినవి . 

ఇంకను వారి గ్రంధములను ఆంగ్లములో అనువదించి ప్రచురించ వలసిన అవసరము ఎంతైనను కలదు . 
హర హర మహాదేవ !
 

ఆరాధ్య చరిత్ర

ఆరాధ్యులు

వీరికి ఆగమాలలో ఆదిశైవులు అని పేరు. వీరే లిం 

Wednesday, July 13, 2022

https://youtube.com/clip/Ugkxr-KQ8WYHwTJu89vjwWjHqfWxGXPlcBVm

 GURU POURNAMI 

clip https://srisaivamahapeetham.blogspot.com/2022/07/httpsyoutubecomclipugkxr.html?m=1

https://youtu.be/Y0JFoCTGOGA

 GURU POURNAMI 

https://youtu.be/Y0JFoCTGOGA

Monday, July 11, 2022

SRI SAIVA MHAHA PEETHAM-PEETADHIPTHI

Tuesday, July 5, 2022

Veerabhadra Pallem at TENALI on 05.07.2022